వంద అడుగుల కొండపై నుంచి జారిపడి...

21 Aug, 2021 12:26 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై  శనివారం విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి జారిపడి పూజారి పాపయ్య మృతి చెందాడు. ఎత్తయిన కొండల మధ్య అడవిలో కొలువైన గంపమల్లయ్య స్వామివారికి పూజలు చేస్తుండగా పాపయ్య ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దాదాపు వంద అడుగుల పైనుంచి జారిపడడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

చదవండి: పెళ్లి చేసుకుంటానని పిలిచి లాడ్జికి తీసుకెళ్లి..

మరిన్ని వార్తలు