జూన్‌ చివరికల్లా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ డిక్లరేషన్‌

10 May, 2022 10:52 IST|Sakshi

సచివాలయ ఉద్యోగుల్లో అర్హుల జాబితాలు పంపాలని ఆదేశాలు

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఇప్పటివరకు అర్హత సాధించిన వారికి జూన్‌ నెలాఖరు కల్లా ప్రొబేషనరీ డిక్లరేషన్‌ ఇవ్వబోతున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ వెల్లడించింది. మండలాలు, జిల్లాల వారీగా అర్హుల జాబితాలు పంపించాలని సంబంధిత శాఖాధిపతులకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్‌ ఎస్‌.షాన్‌మోహన్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలకు గాను సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు జానీపాషా సోమవారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.

చదవండి: (విషాదం: పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థికి గుండెపోటు)

మరిన్ని వార్తలు