ఇంట్లో నుంచి పరార్‌, టీసీకి దొరికిన పిల్లలు

6 Feb, 2021 14:24 IST|Sakshi
ఇంటికి వచ్చిన నలుగురు పిల్లలతో వీరకుమార్‌రెడ్డి

సురక్షితంగా ఇంటికి చేరిన పిల్లలు 

ప్రొద్దుటూరు క్రైం : ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిన పిల్లలు సురక్షితంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని అమృతానగర్‌కు చెందిన మహబూబ్‌బాషా, షేక్‌ జావిద్, విశ్వాసరాజు, వంశీకృష్ణ అనే 13–14 ఏళ్ల పిల్లలు స్నేహితులు. వారు చెప్పకుండా మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. వీళ్లంతా ఒకే వీధికి చెందిన వారు. ఎర్రగుంట్లకు వెళ్లిన నలుగురు ముంబై రైలు ఎక్కారు.

మార్గంమధ్యలోని తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోణం సమీపంలో రైల్లోని టీసీ వారి వద్దకు వచ్చి టికెట్‌ అడిగాడు. లేదని చెప్పడంతో వారి వాలకాన్ని బట్టి పిల్లలు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినట్లు టీసీ గ్రహించాడు. దీంతో టీసీ అరక్కోణం రైల్వేపోలీసులకు వారిని అప్పగించాడు. అక్కడి పోలీసులు అమృతానగర్‌లోని పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సినీహబ్‌ అధినేత బసిరెడ్డి వీరకుమార్‌రెడ్డి సొంత ఖర్చులతో శుక్రవారం నలుగురు పిల్లలను ప్రొద్దుటూరుకు తీసుకొని వచ్చారు. 

మరిన్ని వార్తలు