పోలవరంలో ప్రాజెక్ట్‌ అథారిటీ సీఈవో పర్యటన

20 Dec, 2020 16:01 IST|Sakshi

పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించిన పీపీఏ సీఈవో

సాక్షి, పోలవరం: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్‌ను పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం పరిశీలించారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ పనులు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా పీపీఏ కమిటీ సీఈవో  పనులను పరిశీలించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. స్పిల్ వే పైన ఉన్న కాంక్రీట్ నిర్మాణ పనులను చంద్రశేఖర అయ్యర్‌తో పాటు కమిటీ సభ్యులు డి.గణేష్ కుమార్, కే.లలిత కుమారి ఆయనతో పాటు పనులను పరిశీలించారు. నిర్మాణం వివరాలు నిర్మాణం జరుగుతున్న విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.(చదవండి: చంద్రబాబూ.. అవాస్తవాలు మానండి)

ఇప్పటివరకు జరిగిన పనులను మ్యాపు ద్వారా ప్రాజెక్ట్ సిఈ సుధాకర్ బాబు, ఎస్సీ నాగిరెడ్డిలు వివరిస్తున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు వివరంగా సమాధానాలిచ్చారు. ప్రతి నిర్మాణానికి సంబంధించిన విషయాలను  కూడా కూలంకుషంగా పరిశీలిస్తున్న కమిటీ బంధం సభ్యులు పని జరిగిన విధానాన్ని తమ సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకుంటున్నారు. అనంతరం స్పిల్వేలో ఏర్పాటు చేస్తున్న గేట్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు ఏర్పాటుచేసిన ఆర్మ్ గడ్డర్ల  నాణ్యతను,  బిగింపు పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా  మీడియాతో మాట్లాడిన సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నాలుగు రోజులపాటు పశ్చిమ, తూర్పు గోదావరి జలాల్లో పర్యటిస్తామన్నారు. పోలవరం లో పనులు ఏవిధంగా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు వచ్చామని ప్రాజెక్ట్ పనులు సంతృప్తికరంగా జరుగుతున్నట్లు తెలియజేశారు. స్పిల్ వే, కాంక్రిట్ , ఇతర పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.  కుడి, ఎడమ కాలువలు భూసేకరణ ఎలా ఉన్నది అనే అంశంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నామఅని,  ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు 2230 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పనులు, బిల్లులు పరిశీలించాక  మరిన్ని నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు