చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా..

29 Oct, 2020 17:58 IST|Sakshi

సాక్షి, అమ‌రావ‌తి :  చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏపీ పోలీస్ ఒకేసారి 48 జాతీయ అవార్డులు  పొందటం గర్వించదగ్గ విషయ‌య‌ని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్  అన్నారు. సీఎం వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన స‌హ‌కారం, ప్రోత్సాహంతోనే ఈ అరుదైన గౌర‌వాన్ని సొంతం చేసుకోగ‌లిగామ‌ని తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో పోలీస్ సేవలను ప్రజలకు  మ‌రింత చేరువయ్యేలా చేశామ‌న్నారు. 'మహిళా భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిశా యాప్‌కి బంగారు పతకం వచ్చింది. పోలీస్ సేవలను ప్రజలకు అందించేందుకు విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పోలీస్ సేవా యాప్ ద్వారా ఇంటినుంచే కావాల్సిన సమాచారం తెలుసుకొనే అవకాశం కల్పించాం.  యాప్ ద్వారా 29 రోజుల్లోనే  32000 ఎఫ్ఐఆర్‌లు  డౌన్ లోడ్ చేశారు. దాంతో  పోలీస్ సేవా యాప్‌కి  కూడా బంగారు పతకం వచ్చింది' అని గౌత‌మ్ స‌వాంగ్ పేర్కొన్నారు. (ఏపీ పోలీస్‌ నంబర్‌ వన్ )

సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ సేవలు అందాలన్నది ప్రభుత్వ ఆదేశమ‌ని,  టెక్నాలజీ వినియోగంతో అవినీతిని రూపుమాపాలన్నది సీఎం జ‌గ‌న్  లక్ష్యమ‌ని తెలిపారు పారదర్శకత ,జవాబుదారీతనంతో ఏపీ పోలీస్ ముందుకు సాగుతోందని భ‌విష్య‌త్తులో టెక్నాలజిని పూర్తి స్థాయిలో వినియోగించి ఇంకా మార్పులు తెస్తామ‌న్నారు. ఆన్‌లైన్  గేమింగ్ ,గ్యాంబ్లింగ్ ,బెట్టింగ్‌ల‌పై  ప్రత్యేక దృష్టి సారించామ‌ని గంజాయి, డ్ర‌గ్స్‌పై స్పెష‌ల్ డ్రైవ్‌లు పెట్టి వాటిపై కూడా ఉక్కుపాదం మోపుతామ‌ని డీజీపీ వెల్ల‌డించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసే వారిపై నిఘా పెట్టామని, టెక్నాలజీ వాడి తప్పించుకోవాలని చూసినా ట్రాక్ చేస్తామని హెచ్చ‌రించారు. (48 స్కోచ్‌ గ్రూపు అవార్డులు దక్కించుకున్న ఏపీ )

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు