మద్యం మత్తులో సైకో వీరంగం

5 Oct, 2020 19:07 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని మధురవాడ, కొమ్మాదిలో గల అమరావతి కాలనీలో సైకో వీరంగం చేశాడు. స్థానిక మహిళ మీద కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన చుట్టుపక్కల వారిని భయాందోళనకు గురి చేసింది. వారు తెలిపిన వివరాల ప్రకారం బీ బ్లాక్ 19 లో ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సోమవారం ఉదయం 10:30 గంటలకి అతడు, అతని స్నేహితునితో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో వారిలో వారికే గొడవలు మొదలయ్యాయి. అరుపులు రావడంతో ఆ బ్లాక్ లోని వారు తలుపులు బిగించుకుని భయం భయంగా గడిపారు. ఈలోగా ఆ ఇంటికి వచ్చిన వ్యక్తి మరొక మిత్రుడితో కలిసి కారులో పారిపోయాడు. మరో వ్యక్తి పూర్తిగా మద్యం మత్తులో సైకోలా ప్రవర్తించాడు. నాలుగు సంవత్సరాల చిన్నారిపై దాడి చేయబోయాడు. (చదవండి: బ్యాంక్‌లో సైకో వీరంగం)

అటువైపు వెళ్తున్న టీ షాప్ యజమానురాలు లక్ష్మి ఆ దాడిని అడ్డుకోబోయింది. దాంతో సైకో ఆమెపై కూడా దాడి చేసి, మెడపై గాయాలు చేశాడు. ఒంటి మీద ఏవి లేకుండా, వింత వింతగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని స్థానికులు పట్టుకొని, దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. స్థానిక ఏసీపీ రవిశంకర్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి పరిశిలించారు. పీఎం పాలెం సీఐని కేసు దర్యాప్తు చెయ్యాలని ఆదేశించారు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు