టాప్‌లో ప్రకాశం.. మొత్తం ర్యాంకుల్లో శ్రీకాకుళం

7 Oct, 2021 03:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆర్జీయూకేటీ సెట్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10,389 ర్యాంకులు సాధించగా.. ప్రైవేట్‌ స్కూళ్ల విద్యార్థులకు 9,611 ర్యాంకులు వచ్చాయి. 1 నుంచి 5వేల వరకు ర్యాంకుల్లో ప్రైవేట్‌ స్కూళ్ల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. మొత్తంగా చూస్తే ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులే అత్యధిక ర్యాంకులను సొంతం చేసుకున్నారు. ఈ ఫలితాల్లో ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. 1–1,000 ర్యాంకుల్లో 116 ర్యాంకులతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. 92 ర్యాంకులతో ద్వితీయ స్థానంలో వైఎస్సార్‌ జిల్లా నిలిచింది.

మొత్తం 20 వేల ర్యాంకుల్లో అత్యధికంగా 1,888 ర్యాంకులతో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో ఉండగా.. 1,793 ర్యాంకులతో వైఎస్సార్‌ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. అత్యధికంగా 11,677 మంది వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఓసీలు 3,725 మంది, ఎస్సీలు 1,889 మంది, ఎస్టీలు 363 మంది ఎంపికయ్యారు. వీరు కాకుండా ఈడబ్ల్యూఎస్‌ కోటా కిందికి వచ్చే విద్యార్థులు 2,346 మంది ఉన్నారు. 

మరిన్ని వార్తలు