ఆస్తుల కోసమే రైతుల పేరుతో కృత్రిమ ఉద్యమం

3 Aug, 2020 12:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: అధికార వికేంద్రీకరణ బిల్లు ఆమోదం సందర్భంగా రాజధాని నడిబొడ్డున మందడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సోమవారం రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ప్రజా మహిళా సంఘాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా దేవుడి ఆశిస్సులు, ప్రజాబలం ఈ ప్రభుత్వానికి ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికార వికేంద్రీకరణ బిల్లు తీసుకు వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు. ఆస్తుల్ని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు రైతుల పేరుతో కృత్రిమ ఉద్యమం చేస్తున్నాడు. పేద ప్రజలకు రాజధానిలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే చంద్రబాబు కోర్టుకు వెళ్లి దాన్ని అడ్డుకున్నారు. పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇక్కడి నుంచి హైకోర్టు దాకా వెళ్లి కోర్టును అభ్యర్థిస్తామని పేర్కొన్నారు. కాగా అమరావతిలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడాన్ని దళిత ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

మరిన్ని వార్తలు