'పవన్‌ కల్యాణ్‌ కులాల్ని రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారు'

3 Oct, 2021 11:21 IST|Sakshi

సాక్షి, తిరుపతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కులాల మధ్య చిచ్చురేపుతున్నారంటూ రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'పవన్‌ కల్యాణ్‌ కులాల్ని రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఆయనకు కనిపించడం లేదు. సీఎం జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి మ్యానిఫెస్టోలోని హామీలను అమలుపరచడం పవన్‌కు కనిపించడం లేదా?.

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులకు తీవ్ర అన్యాయం చేసింది. గత ప్రభుత్వంలో సోమల, సదుం మండలాల్లో భూముల రికార్డులు టాంపరింగ్, అక్రమాలు జరిగాయి. సీఐడీ విచారణలో అక్రమాలు వెలుగులోకి వస్తాయి' అని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు.

చదవండి: (ప్యాకేజీ పెంచుకునేందుకే శ్రమదానం)

మరిన్ని వార్తలు