ఏపీ ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకం : ఆర్‌. కృష్ణయ్య

18 Oct, 2020 18:27 IST|Sakshi

సాక్షి, అమరావతి : బీసీల అభివృద్ధి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదివారం సాక్షి టీవీతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ' దేశంలో ఎవరు కూడా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోలేదు.ఇతర రాష్ట్రాల్లో బీసీ లు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఎవరూ కూడా ఇలా కార్పొరేషన్ లకు బీసీలను నియమించలేదు. బీసీలకు నాయకత్వం ఇవ్వడం శుభపరిణామం. బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తారు. సమగ్రంగా అభివృద్ధికి కృషి చేస్తున్నారు.ఇంత చిన్న వయస్సులో ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజకీయంగా ఎవరు ఎదగకూడదు అనే మాత్రమే చూశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు..బీసీ కార్పొరేషన్ లలో మహిళలకు పెద్ద పీట వేయడం గొప్ప విషయం. రాష్ట్ర అభివృద్ధి, బీసీల సమగ్రాభివృద్ధి పట్ల సీఎం జగన్ ఉన్న కృషిని గర్వించదగ్గ విశేషం. (చదవండి : 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..)

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బి.వై.రామయ్య మాట్లాడుతూ... చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నిర్ణయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకోవడం హర్షనీయం. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి అడుగు వేస్తున్నారు.కర్నూలు జిల్లా ను బిసి జిల్లా గా మార్చిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుంది.అతి తక్కువ కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేసి సంక్షేమ పథకాలను అమలు చేశారు.33 వేల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు ఉపయోగించారు.10 వేల కోట్ల రూపాయలను బిసిలకు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు బిసిలను మోసం చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమాలు నిర్వహించి, రాష్ట్రంలోని పేద విద్యార్థులకు అమ్మ ఒడి, జగనన్న విద్య కానుకలను అందిస్తున్నారు.108,104 అంబులెన్స్, ఆరోగ్య శ్రీ పథకాలను అమలు చేసి, కరోనా వైరస్ సమయంలో కూడా ఉచితంగా సేవలందిస్తున్నారు.

శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేశారు. పేదల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో బీసీలకు పెద్ద పీట వేశారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీలకు 670 డైరెక్టర్లను ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌. బీసీ కార్పొరేషన్ లలో 50 శాతం మహిళలకు కల్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావడం విశేషం. (చదవండి : ‘చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది’)


పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ... సీఎం వైఎస్‌ జగన్‌ బీసీలకు పెద్ద పీట వేశారు. బీసీ గర్జనలో ఇచ్చిన మాటను  వైఎస్ జగన్ ఈ రోజు అమలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నిర్ణయాలు తీసుకున్నారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు చేయూత క్రితం సహాయం అందిస్తున్నారు. చెప్పిన మాట అమలు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ కృషి చేశారు. స్వాతంత్య్రం వచ్చిన అప్పటి నుంచి ఇలాంటి నిర్ణయాలు నేను చూడలేదు.

విజయవాడ విశ్వ బ్రాహ్మణ కమిషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడిన కుటుంబం వైఎస్సార్ కుటుంబం. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు పెద్ద పీట వేసిన వ్యక్తి వైఎస్‌ జగన్‌.56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి బీసీల బంగారు భవిష్యత్తుకు తోడ్పాటు అందించారు

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, పూలే కళలు కన్న కలలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారు.బాబు వస్తే జాబు వస్తుంది చెప్పి మోసం చేశాడు చంద్రబాబు, యువభేరి లో చంద్రబాబు ను ప్రశ్నించిన విద్యార్థులపై అక్రమ కేసులు, బెదిరింపు చేశారు. ప్రతి సంక్షేమ పథకాలలో మహిళలకు ఎక్కువగా ప్రాధాన్య ఇచ్చారు.బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, డైరెక్టర్లను కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు.

మరిన్ని వార్తలు