మూడు రోజులు వానలు 

27 Sep, 2022 05:00 IST|Sakshi

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం 

సాక్షి, విశాఖపట్నం: కొద్దిరోజుల నుంచి రాష్ట్రంలో చెదురుమదురుగా కురుస్తున్న వర్షాలు మంగళవారం నుంచి విస్తారంగా కురవనున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఇది సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడురోజులు కోస్తాంధ్రలో అనేక చోట్ల, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు వైఎస్సార్‌ జిల్లా సింహాద్రిపురంలో అత్యధికంగా 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళగిరిలో 7.7 సెంటీమీటర్లు, ఎచ్చెర్లలో 7.6, మనుబోలులో 7.4, మారేడుమిల్లిలో 6.1, బాలాయపల్లిలో 5.8, విజయవాడ, గుడివాడల్లో 5.3, రావికమతంలో 4.6, పెదకూరపాడులో 4.6, మామిడికుదురు, బుక్కపట్నం, నూజివీడుల్లో 4.4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

మరిన్ని వార్తలు