నేటి నుంచి ఏపీలో వర్షాలు

8 Aug, 2021 10:43 IST|Sakshi

12న బంగాళాఖాతంలో అల్పపీడనం?

సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ దిశ నుంచి కోస్తాంధ్ర మీదుగా గాలులు వీస్తుండటంతో కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు ఈ నెల 12న బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా మచిలీపట్నం, గుంటూరు మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఫలితంగా ఆదివారం నుంచి కోస్తా, రాయలసీమల్లో అడపాదడపా వానలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. 13వ తేదీ తరువాత వర్షాలు ఊపందుకుంటాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాయలసీమలో ఒకట్రెండు చోట్ల, దక్షిణ కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. 

మరిన్ని వార్తలు