ఏపీకి వర్షసూచన.. నాలుగు రోజులు వానలే..

31 Mar, 2023 06:56 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మరో నాలుగు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో చెదురుమదురుగా వానలు పడుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, కర్ణాటకల మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. 

దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ గురువారం తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేటలో 2.6 సెంటీమీటర్లు, అన్నమయ్య జిల్లా నూతనకల్వలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.   

మరిన్ని వార్తలు