వచ్చే మూడు రోజులూ వర్షాలే..

27 Jul, 2022 05:15 IST|Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఎక్కువగా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురవనున్నాయని తెలిపింది. కాగా, మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురవగా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి.

పశ్చిమగోదావరి, కాకినాడ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మొగల్తూరులో 5.8 సెంటీమీటర్లు, కాకినాడలో 5.7, తాళ్లరేవులో 5.3, ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో 5.1, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా శివలలో 4.7, నెల్లూరు జిల్లా రేవూరులో 4.6, అనకాపల్లి జిల్లా గోలుకొండలో 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.  

మరిన్ని వార్తలు