కొనసాగుతున్న అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు

19 Oct, 2020 16:13 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతున్నందున కోస్తాంధ్ర, దక్షిణాంధ్రల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ సోమవారం ప్రకటించింది. ఈ అల్పపీడనం రేపటికి (మంగళవారం) మరింతగా బలపడనున్నట్లు వాతావరణం శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు,  రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రంలో పెరగనున్న అలలు  ఉధృతి, సముద్ర తీరం వెంట 45 కి.మీ నుంచి 55 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు