నేడు, రేపు ఉత్తర కోస్తాకు వర్ష సూచన

10 Apr, 2021 03:11 IST|Sakshi

సాక్షి విశాఖపట్నం: తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర– దక్షిణ ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికి తోడు రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. రాయలసీమలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.  

మరిన్ని వార్తలు