ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండ్రోజులు వర్షాలు

1 Nov, 2021 02:55 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక తీరాల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించారు. గడచిన 24 గంటల్లో ప్రకాశం జిల్లా బి.నిడమానూరులో అత్యధికంగా 275 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. చింతవరంలో 57, వై.రామవరంలో 54.5, నూజివీడులో 32.5, పెదబయలులో 31.5 మి.మీ. నమోదైంది.  
(చదవండి: అప్పుడలా.. ఇప్పుడిలా.. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం)

మరిన్ని వార్తలు