సర్కారు వారి ఆరా 

14 May, 2022 17:41 IST|Sakshi

గ్రామాల్లో ఉత్సాహంగా గడగడపకూ మన ప్రభుత్వం

సాలూరు నియోజకవర్గంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం రాజన్నదొర

సాక్షి, పార్వతీపురం:  ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి సాలూ రు నియోజకవర్గంలోని సాలూరు పట్టణ పరిధిలోని 3వ వార్డు గుమడాం గ్రామానికి చెందిన నారాపాటి అప్పారావు తెలుగుదేశం పార్టీ అభిమాని. ఇంట్లో ఎన్‌టీఆర్‌ ఫొటోను కూడా పెట్టుకున్నారు. శుక్రవారం ఉదయం డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈయన ఇంటికి వెళ్లగానే లేచి వచ్చి ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. గతంలో ఎన్‌టీఆర్‌ పాలన చూశాం.

ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలన చూస్తున్నాం. ఎటువంటి ప్రలోభాలు, అడ్డంకులు లేకుండా మా ఇంట్లో వారికి అర్హత ఉన్న అన్ని పథకాలు, పింఛన్‌ అందుతున్నా యి. ఇంత మంచి పాలన ఎప్పుడూ చూడలేదు. ఎన్‌టీఆర్‌ అభిమానినే అయినప్పటికీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాలన చూసిన తరువాత నాకు ఆనందం కలిగిందంటూ తమకు అందుతున్న పథకాల గురించి డిప్యూటీ సీఎంకు  వివరించారు.  

గుమడాం గ్రామంలో నిర్వహించిన గడగడపకూ మన ప్రభుత్వం  కార్యక్రమానికి గ్రామస్తుల అందరి నుంచి ఇదే స్పందన వచ్చింది. పార్టీలకు అతీతంగా సంక్షేమం పొందుతున్న ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని జైజగన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రజా ప్రతినిధులు, వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం రెట్టింపైంది.  సంక్షేమమే లక్ష్యంగా పాలనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అర్హులకు అందుతున్నాయో లేదో ఆరా తీస్తోంది.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మంగా తీసుకున్న గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతంగా జరుగుతోంది. గ్రామా ల్లోని ప్రతి ఇంట్లో సంక్షేమ పథక లబ్ధిదారులు ఉండ గా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వారి గడప ఎక్కుతుండడంతో ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. టీడీపీ అభిమానులు సైతం ప్రభుత్వానికి అభిమానులుగా మారి తాము పొందుతున్న లబ్ధిని తమ గడపకు వచ్చిన నాయకులకు వివరిస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో సచివాల య వ్యవస్థ ద్వారా కల్పించిన ఉద్యోగాల్లో తమ పిల్లలు స్థిరపడిన విషయాన్ని ప్రజాప్రతినిధులకు చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.    

గుమడాంలో  సందడి సందడిగా.. 
సాలూరు నియోజకవర్గం గుమడాం గ్రామంలో శుక్రవారం ఉదయం 7 గంటలకే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైంది. తెల్లవారకముందే స్వయాన డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తమ గ్రామంలోకి వచ్చి తలుపుతడుతున్నారనగానే గ్రామం మొత్తం కదిలింది. డిప్యూటీ సీఎం తమ ఇంటికి వచ్చి కష్టసుఖాలు తెలుసుకోవ డం చాలా ఆనందంగా ఉందని అందరూ సంబరపడుతున్నారు. గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎంకు ప్రతి ఇంటి నుంచి ఆధారాభిమానాలతో పాటు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. పక్కాగా పథకాలు అమలవతున్నాయని, ఎవరికి ఒక్క పైసా కూడా చెల్లించలేదని లబ్ధిదారులు ఆయనకు చెబుతుంటే ఆయన మనసంతా సంతోషంతో నిండిపోయింది.

అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడు తూ ఇంతటి సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఘనమైన మెజార్టీ అందించాలని గ్రామస్తులను కోరారు. అక్కడక్కడ ఒకరిద్దరు టీడీపీ కార్యకర్తలు పచ్చ చొక్కాలు వేసుకుని, గొంతులు చించుకుని లేని పోని ఆరోపణ లు చేసినంత మాత్రాన సంక్షేమ పథకాలు ఆగవని, ప్రజలు వారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో సాలూరు మున్సిపల్‌ చైర్మన్‌ పూల ఈశ్వరమ్మ, వైస్‌ ఎంపీపీ రెడ్డి సురేష్, వైఎస్సార్‌సీపీ పాచిపెంట నాయకులు పి.గౌరీశ్వరరావు, పాచిపెంట వీరన్నాయుడు, మండల కన్వీనర్‌ గొట్టాపు ముత్యాలనాయుడు, దండి శ్రీనివాసరావు,  వార్డు కౌన్సిలర్‌ తాడ్డి లక్ష్మి, వైఎస్సార్‌సీపీ పట్టణ పార్టీ కన్వీనర్‌ జరజాపు సూరిబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు