గిరిపుత్రుల్లో కొత్త ‘రాజ’సం  

12 Apr, 2022 16:34 IST|Sakshi

గిరిజనులకు తగిన గుర్తింపునిస్తూ పార్వతీ పురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వారికి మరో వరం అందించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, గిరిజనులకు తలలో నాలుకలా ఉన్న పీడిక రాజన్నదొరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఉపముఖ్యమంత్రిగా అత్యున్నత గౌరవం కల్పించారు. గౌరవం పొందిన రాజన్నదొర రాక కోసం పార్వతీపురం మన్యం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

గిరిజన కుటుంబం నుంచి వచ్చిన రాజన్నదొర పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదివారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మేనేజరుగా కొన్నేళ్లు పనిచేశారు. ప్రజాసేవపై మక్కువతో ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేశారు. వరుసగా నాలుగు దఫాలు సాలూరు నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. గిరిజన బిడ్డగా, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయనపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయి. తమ సమస్యల పరిష్కారానికి ఒక మార్గం చూపిస్తారని ఆశిస్తున్నారు. గిరిజనులపై ప్రత్యేక మమకారం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో తమ ప్రాంతాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తారని విశ్వసిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన పార్వతీపురం మన్యం జిల్లాలో తొలి మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా రాజన్నదొర తనదైన ముద్ర వేసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
రాజన్న ముందు సవాళ్లు.... 
∙గిరిశిఖర గ్రామాలకు రోడ్లు వేయడానికి అటవీశాఖ అనుమతులు రాక పనులు అర్ధంతరంగా ఆగిపోతున్నాయి. వాటికి పరిష్కారం చూపా ల్సిన అవసరం ఉంది. 

∙అభివృద్ధిగా దూరంగా ఉన్న గిరిశిఖర గ్రామాల్లో గిరిజనులకు విద్య, వైద్యం పూర్తిస్థాయిలో  అందేలా చేయాలి. 
∙గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులు దళారుల బారిన పడకుండా జీసీసీ ద్వారా గిట్టుబాటు« దరకు కొనుగోలు జరిగేలా చూడాలి. 
∙పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆధ్యాత్మిక, ఆçహ్లాదకర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. 
∙వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వేలాది మంది గిరిజనులకు పోడు (ఆర్‌వోఎఫ్‌ఆర్‌) పట్టాలు అందాయి. ఆ భూముల్లో చిరుధాన్యాలు, ఉద్యానవన పంటలు సాగు మరింత పెరిగేలా ప్రోత్సా హకాలు అందించాల్సి ఉంది.   

రాజన్నదొరకు శుభాకాంక్షలు...
చీపురుపల్లి: డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీడిక రాజన్నదొరకు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం అమరావతిలో దుశ్శాలువతో సత్కరించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఉన్నారు.  

మరిన్ని వార్తలు