అన్నపూర్ణగా రాజశ్యామల అమ్మవారు 

11 Oct, 2021 06:04 IST|Sakshi
శ్రీశారదా పీఠంలో అమ్మవారికి పూజలు చేస్తున్న స్వామీజీలు

పెందుర్తి: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదా పీఠంలో నాలుగో రోజు ఆదివారం అన్నపూర్ణదేవిగా శ్రీశారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం చేశారు.

లోకకల్యాణార్థం పీఠంలో చేపట్టిన శత చండీయాగం, శ్రీమత్‌ భాగవత పారాయణం, వేదపారాయణం, నవావరణ అర్చన శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం అమ్మవారికి స్వామీజీల చేతుల మీదుగా ఏకాదశ హారతులు ఇచ్చారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం (నేడు) లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారని పీఠం ప్రతినిధులు వెల్లడించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు