ఘనంగా రామచంద్రమ్మ జాతర 

27 May, 2022 23:59 IST|Sakshi
రామచంద్రమ్మ అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు  

యలమంచిలి రూరల్‌: యలమంచిలిలో రామచంద్రమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. అ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. బాణసంచా కాల్చారు.

ఘనంగా యల్లమ్మ తల్లి పండుగ 
మునగపాక: మండల కేంద్రంలో యల్లమ్మతల్లి అమ్మవారి పండగ ఘనంగా జరిగింది. మావూరి, బూడిద కుటుంబాలకు చెందిన వారంతా రెండేళ్లకొకసారి ఈ పండగ జరుపుకుంటారు. ఈ ఏడాది భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.  

ఘనంగా సాయిబాబా సప్తాహం 
మునగపాక: స్థానిక సాయిబాబా మందిరంలో సప్తాహ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. సాయినామ స్మరణతో మునగపాక మార్మోగింది. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో సాయి కీర్తనలు ఆలపించారు. ఆలయ చైర్మన్‌ బొడ్డేడ వీరేంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమలం నిర్వహించారు. 

పూడిమడకలో మహోత్సవాలు ప్రారంభం  
అచ్యుతాపురం(అనకాపల్లి): పూడిమడక అమ్మవారి మహోత్సవాలు గురువారం మొదలయ్యాయి. జూన్‌ 2వ తేదీ వరకు గంటాలమ్మతల్లి, దుర్గాలమ్మ తల్లి, సత్తెమ్మతల్లి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు స్థానికుడైన పోలవరపు పారునాయుడు తెలిపారు.   

మరిన్ని వార్తలు