హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి

20 Sep, 2020 12:41 IST|Sakshi

మీడియా హక్కుల పరిరక్షణ కోసం నిరాహార దీక్ష

ఏపీ జర్నలిస్ట్ డెవలప్ మెంట్ సోసైటీ అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి 

సాక్షి, అనంతపురం: మీడియా హక్కుల పరిరక్షణ కోసం 48 గంటల దీక్ష చేస్తానని ఏపీ జర్నలిస్ట్ డెవలప్ మెంట్ సోసైటీ అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి నిరాహారదీక్ష చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని అన్నారు. ‘‘అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌పై ఎందుకు వార్తలు ఇవ్వకూడదు. జడ్జిలకు ఒక న్యాయం.. సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. (చదవండి: టీడీపీ లాయర్లే జడ్జిలు)

హైకోర్టు తీర్పు వల్ల న్యాయ వ్యవస్థపై విశ్వాసం తగ్గే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జడ్జిలు పరిమితులకు లోబడి వ్యవహరించాలన్నారు. ఏపీ హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీడియా హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని రామలింగారెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు