Prakasam: టెలిఫోన్‌ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా రమణారెడ్డి

14 May, 2022 13:43 IST|Sakshi
ఎంపీ మాగుంట నుంచి నియామక పత్రం అందుకుంటున్న రమణారెడ్డి

సాక్షి, ప్రకాశం(బేస్తవారిపేట): జిల్లా టెలిఫోన్‌ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా మండలంలోని రెడ్డినగర్‌కు చెందిన యన్నం వెంకట రమణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు  మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఒంగోలులో శుక్రవారం అందుకున్నారు. అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించిన ఎంపీ మాగుంటకు రమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఎంపీ మాగుంట నుంచి నియామక పత్రం అందుకుంటున్న పులి వెంకట కృష్ణారెడ్డి

కృష్ణారెడ్డి కూడా.. 
తాళ్లూరు: టెలిఫోన్‌ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా బొద్దికూరపాడు మాజీ సర్పంచి పులి వెంకట కృష్ణారెడ్డిని నియమిస్తూ ఆ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణారెడ్డి గతంలో గ్రామ సర్పంచిగా పని చేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీలో కీలక నాయకుడిగా పనిచేస్తున్నారు. తనను అడ్వైజరి కమిటీ సభ్యుడిగా నియమించేందుకు సహకరించిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ మద్దిశెట్టి వేణుగోపాల్‌కు పీవీ కృష్ణారెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. 

మరిన్ని వార్తలు