కాసులు కురిపించిన ఓ చేప.. చైనాకు ఎగుమతి!

9 Feb, 2022 09:03 IST|Sakshi

నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 18 కిలోల కచ్చిడి చేప చిక్కింది. దీనిని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రేవు వద్ద సోమవారం అమ్మకానికి పెట్టగా.. నరసాపురానికి చెందిన వ్యాపారి నంద్యాల శ్రీనివాసరావు రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశాడు.

మంగళవారం దీనిని కోల్‌కతాలోని ఓ చేపల ఎగుమతి కేంద్రానికి రూ.2 లక్షలకు విక్రయించాడు. అక్కడి నుంచి ఈ చేపను చైనాకు ఎగుమతి చేస్తారని శ్రీనివాసరావు తెలిపాడు.

మోటారు బావిలో చిక్కుకున్న పునుగు పిల్లి
తోట్లవల్లూరు: ఎక్కడనుంచి వచ్చిందో కానీ ఓ పునుగుపిల్లి మోటారుబావిలో చిక్కుకుంది.  కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు గ్రామానికి చెందిన రైతు మర్రెడ్డి కేశవరెడ్డి తన పొలంలోని మోటారుబావిలో పునుగుపిల్లి చిక్కుకుని ఉండటాన్ని గుర్తించి మంగళవారం గ్రామ సచివాలయ సిబ్బందికి సమాచారమిచ్చారు.

మరిన్ని వార్తలు