‘ఆరోగ్యశ్రీ’లో అరుదైన ఆపరేషన్‌

5 May, 2022 04:39 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డాక్టర్‌ అమర్‌నాథ్, పక్కన రోగితో పాటు జి.రవికిరణ్‌

లబ్బీపేట(విజయవాడతూర్పు): మల్టీపుల్‌ మైలోమా అనే బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగికి విజయవాడలో తొలిసారిగా బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఎంతో ఖరీదైన ఈ చికిత్సను వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిర్వహించినట్లు హెచ్‌సీజీ క్యాన్సర్‌ సెంటర్‌ హెమటాలజిస్ట్‌–బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ నిపుణులు డాక్టర్‌ అమర్‌నాథ్‌ పొలిశెట్టి తెలిపారు.

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ నగరంలోని ఆస్పత్రిలో బుధవారం చికిత్స వివరాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన వెంకటేశ్వరరావు (55) మల్టీపుల్‌ మైలోమా అనే బ్లడ్‌ క్యాన్సర్‌తో ఏడాదిగా బాధపడుతున్నాడు. అతనికి కీమోథెరపీ చికిత్స అందిస్తూ, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో మార్చి 23న బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశారు. కార్యక్రమంలో రోగితో పాటు హెచ్‌సీజీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జి.రవికిరణ్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు