పోర్టబులిటీ.. ‘వలస’పాలిట పెన్నిధి

13 Oct, 2020 20:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఈ సౌకర్యంతో వారంలోనే 34 లక్షల కుటుంబాలకు లబ్ధి

13వ విడత ఉచిత పంపిణీలో ఇప్పటి వరకు..

మొత్తం 1.13 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం

సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థలో పోర్టబులిటీ సౌకర్యంతో లబ్ధిదారులు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఉచిత సరుకులు పొందుతున్నారు. ఉపాధి నిమిత్తం పనుల కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలకు పోర్టబులిటీ సౌకర్యం ఆదుకుంటోంది. ఈ విధానం వల్ల రాష్ట్రంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటు లభించింది. పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారికి కూడా ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ, కర్ణాటకల్లోనూ అంతర్రాష్ట్ర పోర్టబులిటీని అమల్లోకి తెచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు అక్కడే నిత్యావసర సరుకులు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి నెలకు రెండు విడతల చొప్పున ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తోంది.

  • ఈ నెల 3వ తేదీ నుంచి 13వ విడత ఉచిత సరుకుల పంపిణీ ప్రారంభమైంది.
  • రాష్ట్రంలో ప్రస్తుతం 1.51 కోట్ల కార్డుదారులుంటే ఇప్పటికి 1.13 కోట్ల కుటుంబాలు ఉచిత సరుకులు అందుకున్నాయి.
  • ఈ నెలలో పంపిణీ ప్రారంభమైన వారంలోనే(శనివారం నాటికి) 34 లక్షలకు పైగా కుటుంబాలు పోర్టబులిటీతో లబ్ధిపొందారు.

13వ విడతలో సరుకులు తీసుకున్న, పోర్టబులిటీతో లబ్ధి పొందిన
 కుటుంబాల వివరాలు (జిల్లాల వారీగా):

జిల్లా సరుకులు తీసుకున్న కుటుంబాలు     పోర్టబులిటీతో..లబ్ధి పొందిన కుటుంబాలు    
అనంతపురం 10,57,690     2,56,362    
చిత్తూరు     9,59,828     1,71,568    
తూ.గోదావరి 13,14,140     4,22,821    
గుంటూరు     11,39,290     4,68,253    
కృష్ణా 9,84,295     3,74,443    
కర్నూలు     9,80,230 3,49,778    
ప్రకాశం 7,89,353     2,02,858    
శ్రీకాకుళం     1,97,250 1,595
నెల్లూరు     6,47,311     1,76,644    
విశాఖపట్నం 10,53,722     3,75,345
విజయనగరం 6,02,782 92,375    
ప. గోదావరి 9,91,955 3,29,270    
వైఎస్సార్‌ కడప 6,78,163 1,83,813    
మొత్తం 1,13,96,009 34,05,125

>
మరిన్ని వార్తలు