‘ఇంటింటికీ రేషన్‌’పై విచారణ నేటికి వాయిదా

10 Feb, 2021 05:28 IST|Sakshi

ఈ పథకం కొత్తది కాదు.. 2019లోనే ప్రారంభించాం 

ప్రభుత్వ పథకాల ప్రచారానికి సీఎం, దివంగత నేతలు ఫొటోలు వాడొచ్చని ‘సుప్రీం’ స్పష్టం చేసింది 

హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్‌ జనరల్‌ 

సాక్షి, అమరావతి: ‘ఇంటింటికీ రేషన్‌’ పథకం అమలును నిలిపివేస్తూ ఎన్నికల కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది వాదనల నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ పథకం కొత్తది కాదని, 2019లోనే ప్రభుత్వం దీనిని ప్రారంభించిందన్నారు.

పథకం అమలుకు అవసరమైన సంచార వాహనాలను ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే గత నెల 21న ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పథకం అమలుపై అన్ని వివరాలను ఎన్నికల కమిషన్‌కు నివేదించినట్టు తెలిపారు. అయితే, ఎన్నికల కమిషనర్‌ వాహనాలపై ఉన్న రంగులతోపాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ బొమ్మలు ఉండటంపైనా అభ్యంతరం తెలిపారన్నారు. వాహనాలపై ఇతర రాజకీయ పారీ్టలు ఉపయోగిస్తున్న రంగులు కూడా ఉన్నాయని తెలిపారు.

ఫొటోలు ఉండొచ్చని ‘సుప్రీం’ చెప్పింది 
ప్రభుత్వ పథకాల ప్రచారంలో ముఖ్యమంత్రి, దివంగత నేతల ఫొటోలు ఉపయోగించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచి్చందని హైకోర్టుకు నివేదించిన ఏజీ ఆ తీర్పును చదివి వినిపించారు. ఎన్నికల కమిషన్‌ చెప్పిన విధంగా సంచార వాహనాల రంగులు మార్చాలంటే కొన్ని నెలలు పడుతుందన్నారు. ఇంటింటికీ రేషన్‌ పథకాన్ని ఇప్పుడు నిలిపివేయడం అనేక సమస్యలకు దారి తీస్తుందన్నారు. ఏజీ వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది వాదనల నిమిత్తం విచారణను బుధవారం మధ్యాహా్ననికి వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు