ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన ఆర్‌బీఐ

23 Oct, 2021 17:23 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పందించింది. రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌కు బ్యాంక్‌ రుణాల అవకతవకలపై విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆర్‌బీఐ.. తగిన చర్యలు తీసుకుంటామంటూ విజయసాయిరెడ్డికి తెలిపింది. (చదవండి: రెండో పెళ్లి చేసుకోవాలంటే ఆ గుడికే వెళ్తారు.. ఎందుకంటే..!)

2014-18 మధ్యలో పంజాబ్‌ కాన్సార్షియం దగ్గర రూ.826 కోట్ల రుణాలను ఇండ్‌ పవర్‌ తీసుకుంది. 2020 అక్టోబర్‌లో రుణాల స్కాంపై ఇండ్‌ పవర్‌ సంస్థకు చెందిన 11 చోట్ల సీబీఐ రైడ్స్‌ నిర్వహించింది. రుణాలు తీసుకుని ఇండ్‌ పవర్‌ సొంత అకౌంట్లకు డబ్బులు మళ్లించుకున్నట్లు సీబీఐ గుర్తించింది.
చదవండి: చంద్రబాబు దీక్షలపై డిక్షనరీ రాయాలి: కన్నబాబు

మరిన్ని వార్తలు