కొత్త డివిజన్లకు ఆర్‌డీవోల నియామకం

4 Apr, 2022 08:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 47 మంది స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యుటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్‌డీవోలుగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 21 కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోల నియామకం కోసం పలువురిని బదిలీ చేశారు. కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ డివిజన్లలో సోమవారం నుంచి పరిపాలన ప్రారంభం కానుంది.

ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జేసీ (ఆసరా–సంక్షేమం)గా పని చేస్తున్న కె. శ్రీరాములు నాయుడును సహకార శాఖ (సొంత శాఖ)కు బదిలీ చేశారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా జేసీ (ఆసరా–సంక్షేమం)గా పనిచేస్తున్న ఎం.కె.వి. శ్రీనివాసులును  వ్యవసాయ, సహకార శాఖ (సొంత శాఖ)కు బదిలీ చేశారు. ఆర్‌డీవోల బదిలీలు ఇలా ఉన్నాయి.

మరిన్ని వార్తలు