జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తగ్గిన ఉత్తీర్ణత శాతం

13 Sep, 2022 05:52 IST|Sakshi

గతేడాది 29.54 ఉత్తీర్ణత శాతం

ఈ ఏడాది 26.17 శాతమే

క్వాలిఫైడ్‌ మార్కులూ తగ్గుదల

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2022లో గతంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. అలాగే ఈ ఏడాది పరీక్ష రాసినవారి సంఖ్య కూడా తక్కువ ఉంది. కరోనా సమయంలో కన్నా ఈసారి విద్యార్థుల సంఖ్య మరింత తగ్గిపోవడం గమనార్హం. గత నాలుగేళ్ల గణాంకాలను గమనిస్తే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది.

జేఈఈ మెయిన్‌లో మెరిట్, రిజర్వేషన్‌ ప్రాతిపదికన టాప్‌ 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారనే విషయం తెలిసిందే. అయితే 2.50 లక్షల మందికి అవకాశమిస్తున్నా అందులో లక్ష పైనే విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేయడం లేదు. అలా దరఖాస్తు చేసిన వారిలోనూ పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య మరింత తగ్గుతోంది. 2019లో 2.50 లక్షల మందికి గాను 1,74,432 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఈ ఏడాది 1,55,538 మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.  

మరిన్ని వార్తలు