కొత్త కోర్టులతో సత్వర న్యాయం అందాలి

31 Jul, 2023 03:40 IST|Sakshi
అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి న్యాయస్థానాన్ని ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తులు  

జ్యుడిషియల్‌ సిబ్బందికి హైకోర్టు న్యాయమూర్తుల సూచన 

విజయనగరంలో అదనపు సీనియర్‌ సివిల్‌ కోర్టు ప్రారంభం 

విజయనగరం లీగల్‌: విజయనగరం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన న్యాయస్థానాల ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు అభిలషించారు. ఈ దిశగా న్యాయాధికారులు, న్యాయవాదులు కృషి చేయా­లని వారు పిలుపునిచ్చారు. విజయనగరంలోని జిల్లా న్యాయ­స్థానా­ల సముదాయంలో కొత్తగా మంజూరైన అదనపు సీనియర్‌ సివిల్‌ కోర్టుని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్, జస్టిస్‌ ఉపమాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ దుప్పల వెంకటరమణ ప్రారంభించారు.

న్యాయసేవా సదన్‌లో ఏర్పాటు చేసిన లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కార్యాలయాన్ని జస్టిస్‌ ఏవీ శేషసాయి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువ న్యాయవాదులకు తగిన శిక్ష­ణ ఇచ్చి మెరికల్లాంటి న్యాయవాదులను అందించాలని సీనియర్‌ న్యాయవాదులకు సూచించారు. న్యాయవాదులు, న్యాయాధికారులు పరస్పరం గౌరవించుకోవడం ద్వారా సమాజానికి మేలు చేయగలమన్నారు. జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ మాట్లాడుతూ జిల్లా కోర్టు భవన సముదాయాలకు రూ.99 కోట్లతో మంజూరైన కొత్త భవనాలను నాణ్యతగా నిరి్మంచేలా బార్‌ కౌన్సిల్, యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా జడ్జి బి.సాయి కళ్యాణచక్రవర్తి, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు