రేపటి నుంచి తరగతులు ప్రారంభం

1 Nov, 2020 04:37 IST|Sakshi

డిగ్రీ, పీజీ కాలేజీలకు అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

సాక్షి, అమరావతి: డిగ్రీ, పీజీ తదితర కోర్సుల కాలేజీల పునఃప్రారంభానికి సంబంధించి ఉన్నత విద్యాశాఖ శుక్రవారం రాత్రి అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది. నవంబర్‌ 2 నుంచి సరి, బేసి సంఖ్యల రోజుల్లో తరగతులు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో కూడా వీటిని కొనసాగించేలా మార్గదర్శకాలిచ్చారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రొఫెషనల్, నాన్‌ ప్రొఫెషనల్‌ ఫస్టియర్‌ తరగతులను డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభించనున్నారు. 

► వారంలో ఆరు రోజులు పనిదినాలుంటాయి. ఏదైనా కారణాల వల్ల పని దినాన్ని కోల్పోవాల్సి వస్తే రెండో శనివారం, ఇతర సెలవు దినాల్లో (నేషనల్‌ హాలిడేలు, ముఖ్యమైన పండుగ దినాలు మినహా) భర్తీ చేయాలి.
► ఫస్టియర్‌ పీజీ ప్రోగ్రాంల షెడ్యూల్‌ను వేరుగా విడుదల చేస్తారు. కోవిడ్‌ నిబంధనలను అనుసరించి కాలేజీలను నిర్వహించాల్సి ఉంటుంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా