శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటి విడుదల

17 Oct, 2021 05:29 IST|Sakshi

శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురిసౌత్‌(మాచర్ల): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఐదోసారి శుక్రవారం రెండు రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను తెరచి నీరు విడుదల చేశారు. శనివారం నాటికి వరద ఉధృతి తగ్గడంతో ఒక గేట్‌ను 10 అడుగుల మేరకు తెరచి 28,029 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. 2 జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ మరో 66,283 క్యూసెక్కులను సాగర్‌కు వదులుతున్నారు.

ప్రస్తుతం జలాశయంలో 214.8450 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్‌ నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో ఆరు క్రస్ట్‌గేట్ల ద్వారా 48,540 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం 589.90 అడుగులు ఉంది. 

మరిన్ని వార్తలు