‘కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై నివేదిక రావాల్సి ఉంది’

23 May, 2021 17:44 IST|Sakshi

రాష్ట్రంలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత లేదు: ఏకే సింఘాల్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రుల్లో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. రాష్ట్రంలో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 23,685.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 18,094 రెమిడెసివిర్స్‌ అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.

అలాగే అన్ని జిల్లాలకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 918 ఐసీయూ బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయని ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో కొత్తగా 18,767 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,109 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 

కాగా, రాబోయే మూడురోజులు ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టనున్నట్లు సింఘాల్‌ తెలిపారు. అలాగే కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. బ్లాక్‌ ఫంగస్‌కు అవసరమైన మందులను జిల్లాలకు సరఫరా చేస్తున్నామన్నారు. కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై నివేదిక రావాల్సి ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు