117 బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ

4 May, 2021 03:36 IST|Sakshi

శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ బోధన విభాగంలో ఖాళీలు 

ఎనిమిదేళ్ల తర్వాత జరగనున్న పోస్టుల భర్తీ

సాక్షి, అమరావతి: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీతో పాటు వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బోధన విభాగంలో ఖాళీగా ఉన్న 117 బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సుమారు 8 ఏళ్ల తర్వాత ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు కేటాయించిన ఈ పోస్టుల భర్తీకి ఇటీవలే యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో 47 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 70 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులున్నాయి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు సంబంధించి వెటర్నరీ సైన్స్‌లో 40, ఫిషరీస్‌ సైన్స్‌లో 4, డెయిరీ సైన్స్‌లో 2, వ్యవసాయ విభాగంలో ఒక పోస్టు ఉన్నాయి.

అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు సంబంధించి వెటర్నరీ సైన్స్‌లో 64, ఫిషరీస్‌ సైన్స్‌లో 4, డెయిరీ సైన్స్‌లో 2 పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 4.30 గంటలలోగా ది రిజిస్ట్రార్, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్, డాక్టర్‌ వైఎస్సార్‌ భవన్, తిరుపతి–517502 చిరునామాకు దరఖాస్తులు పంపాలని యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ వి.పద్మనాభరెడ్డి చెప్పారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్‌వివియూ.ఈడీయూ.ఇన్‌లో చూడాలని ఆయన సూచించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు