ఏపీలో బోధనకు కితాబు 

11 Nov, 2022 04:38 IST|Sakshi
విద్యా విధానం పరిశీలిస్తున్న సోనాల్‌సిల్వ గుండె

కృష్ణా జిల్లా అంగలూరు ‘డైట్‌’ను సందర్శించిన ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులు  

గుడ్లవల్లేరు: ఏపీలో బోధన విధానాన్ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మెచ్చుకున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సోనాల్‌సిల్వ గుండె(మహా రాష్ట్ర), నళినీకుమార్‌ మిశ్రా(బిహార్‌)లు గురువారం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్‌)ను సందర్శించారు. డైట్‌లో జరుగుతున్న బోధన, బోధనేతర కార్యక్రమాల్లో ప్రతి అంశాన్నీ డైట్‌ ప్రిన్సిపాల్‌ లక్ష్మీనారాయణను సోనాల్‌ సిల్వ గుండె, నళినీకుమార్‌ మిశ్రాలు అడిగి తెలుసుకున్నారు.

వుయ్‌ లవ్‌ రీడింగ్‌లో భాగంగా జరిగిన పుస్తక సమీక్షలను పరిశీలించారు. కంప్యూటర్‌ ల్యాబ్, గణిత ప్రయోగశాల, సైన్స్‌ ల్యాబ్, భాషా ప్రయోగశాలను చూసి ప్రశంసించారు. డైట్‌ రేడియో స్టేషన్‌ను తిలకించారు. దేశంలో వివిధ విద్యా సంస్థలను చూశామని.. ఇలాంటి కార్యక్రమాలు ఎవరూ నిర్వహించడం లేదని అధ్యాపకులను అభినందించారు. మిగిలిన విద్యా సంస్థల్లో ఈ విధానాలు అమలయ్యేలా సూచిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు