రద్దయిన రైళ్ల పునరుద్ధరణ 

29 Jun, 2021 04:36 IST|Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): విజయవాడ–విశాఖపట్నం సెక్షన్‌ల మధ్య ట్రాక్‌ నిర్వహణ పనుల కారణంగా ఆ మార్గంలో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ పీఆర్‌వో నస్రత్‌ మండ్రూప్కర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాత్కాలికంగా రద్దు చేసిన విశాఖపట్నం–విజయవాడ (02717/02718), విశాఖపట్నం–గుంటూరు (07240/07239), విశాఖప్నటం–లింగంపల్లి (02831/02832), విశాఖపట్నం–కడప (07488/07487) రైళ్లను యథావిధిగా నడపనున్నట్టు తెలిపారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు