రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ కోటయ్య మృతి

1 Jun, 2021 05:07 IST|Sakshi
కోటయ్య (ఫైల్‌)

కోట/నెల్లూరు (అర్బన్‌): కృష్ణపట్నంలోని ఆనందయ్య మందు తీసుకుని కరోనా నుంచి కోలుకున్నానని చెప్పిన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపూడికి చెందిన విశ్రాంత హెచ్‌ఎం బైనా కోటయ్య(62) సోమవారం మృతి చెందారు. ఆ మందు కరోనాకు బాగా పని చేస్తుందంటూ కోటయ్య మాటల వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించి ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడంతో ఈ నెల 22న ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్ల సూచనల మేరకు కుటుంబ సభ్యులు నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు.

‘ఊపిరితిత్తులు క్షీణించడంతోనే.. ’
కోటయ్యకు ఆస్పత్రికి వచ్చేటప్పటికే ఊపిరితిత్తులు 80 శాతం వరకు దెబ్బతిన్నాయని పెద్దాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభాకర్‌ సోమవారం చెప్పారు. ఆనందయ్య మందు తీసుకున్న తరువాత నాలుగు రోజులకు కోటయ్య ఆరోగ్యం బాగలేదంటూ పెద్దాస్పత్రిలో చేరాడని చెప్పారు. అప్పటికే కోటయ్య మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా ఉండటంతో తాము మరింత కేర్‌ తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో తాము చేసిన వైద్యం వల్ల కొంత మెరుగైనప్పటికీ మళ్లీ ఆరోగ్యం విషమించి మృతి చెందాడని తెలిపారు.  

మరిన్ని వార్తలు