AP: ఆ టీచర్ల పదవీవిరమణ వయసు పెంపు 

27 Nov, 2021 07:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 164 మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తోన్న ప్రిన్సిపల్స్, టీచర్ల పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఈ పదవీ విరమణ వయస్సు పెంచడంపై మోడల్‌ స్కూల్స్‌ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఏపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కోమటిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ మోడల్‌ స్కూల్స్‌ టీచర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌ రెడ్డి,  ప్రధాన కార్యదర్శి మార్కండేయ హనుమంతరావులు హర్షం వ్యక్తం చేశారు.
చదవండి: కుప్పంలో భూప్రకంపనలు.. భారీ శబ్దాలు..

మరిన్ని వార్తలు