ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ రూ.3,950 కోట్ల ఆదాయం

21 Jan, 2021 04:33 IST|Sakshi
రికార్డులను పరిశీలిస్తున్న ఉదయభాస్కరరావు

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ అడిషనల్‌ ఐజీ వెల్లడి

భీమవరం (ప్రకాశం చౌక్‌): ఈ ఆర్థిక సంవత్సరం స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.3,950 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆ శాఖ అడిషనల్‌ ఐజీ ఎం.ఉదయభాస్కరరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో బుధవారం ఆయన రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం తమ శాఖ ఆదాయ లక్ష్యం సుమారు రూ.6,336 కోట్లుగా తెలిపారు. అంతకు ముందు డిసెంబర్‌ నెలలో సుమారు రూ.421 కోట్ల ఆదాయం వస్తే, గతేడాది డిసెంబర్‌లో రూ.599 కోట్లు వచ్చిందని ఉదయభాస్కరరావు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు