రాష్ట్రంలో పెరుగుతున్న చలి

9 Nov, 2020 06:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో ఈశాన్య గాలులు తక్కువ ఎత్తులో వీస్తుండడంతో కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులొస్తున్నాయి. కోస్తా, రాయలసీమల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి.

విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోయాయి. కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం కనిపిస్తోంది. ఈశాన్య రుతుపవనాల కారణంగా రెండు రోజుల పాటు ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 

మరిన్ని వార్తలు