'ఆ సమయంలో చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కున్నారు'

20 Nov, 2020 12:13 IST|Sakshi

సాక్షి, తిరుమల: చంద్రబాబు నాయుడి జీవితం మొత్తం వెన్నుపోటు, శవరాజకీయాలకే సరిపోయిందని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 'కార్తీక​ మాసంలో స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం. వెయ్యికాళ్ల మండపం త్వరలో ప్రారంభించేందుకు టీటీడీ చైర్మన్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శకంగా రాజకీయాలు నడుపుతున్నారు. తిరుపతి ఎంపీ కరోనాతో మృతి చెందితే, హడావిడిగా అభ్యర్థిని ప్రకటించి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు.

కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అవుతన్న సమయంలో కూడా 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి ప్రజలకు కనీసం భరోసా కూడా కల్పించలేని పరిస్థితి చంద్రబాబుది. కరోనా సమయంలో ప్రజల గురించి ఆలోచించకుండా చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కున్నారు. జగన్‌ పార్టీ పెట్టినప్పటి నుంచి మరణం సంభవించిన కుటుంబంలో పోటీపెట్టకుండా ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గం వారిని నిలబెట్టేందుకు లోకల్‌ బాడీ ఎన్నికల కోసం హడావిడి చేస్తున్నారు.  ('ఇలాంటిదెప్పుడైనా ఊహించారా.. దటీజ్‌ సీఎం జగన్‌')

స్థానిక సంస్థల ఫండ్స్‌ రాకపోతే అభివృద్ధి కుంటుపడుతుందిని ఎన్నికలు పెడితే కరోనా కుంటిసాకు చూపించి ఎన్నికలు వాయిదా పడేలా చేశారు. ఇప్పుడేమో రాష్ట్రంలో కరోనా లేదని పెద్దమనుషులు ఆరాట పడుతూ ఎన్నికలు పెట్టాలని స్టేట్మెంట్స్‌ ఇస్తున్నారు. మార్చి లోపల ఎన్నికలు పెడితే టీడీపీ అన్ని స్థానాలు గెలుచుకుంటామనే భ్రమలో ఉంది. రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు మూడున్నర కోట్ల అప్పులో ముంచేసారు. రాష్ట్రంలో పదహారు నెలల కాలంలో నాలుగున్నర కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చేశారు. కరోనా సమయంలోనూ ప్రజలను ఆదుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమే' అని కొనియాడారు. (అనంతపురంలో భారీ డ్రోన్‌ సిటీ)

మరిన్ని వార్తలు