ముమ్మరంగా రోడ్డు విస్తరణ పనులు 

19 Apr, 2022 17:28 IST|Sakshi

బాపట్ల: జిల్లా కేంద్రమైన బాపట్లలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రోడ్ల విస్తర్ణ జిల్లా కేంద్రానికి అనుగుణంగా సాగుతున్నాయి. పట్టణంలోని ముఖ్యమైన రోడ్లు విస్తర్ణతోపాటు సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పట్టణంలో ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టారు. మొత్తం 13 రోడ్లును విస్తరించడంతోపాటు వాటిలో విశాలమైన రోడ్లు పురప్రజలతోపాటు జిల్లా కేంద్రానికి వస్తోన్న ప్రజలకు కూడా స్వాగతం పలికేవిధంగా ఉన్నాయి.  

పట్టణంలో విశాలమైన రోడ్లు...  
బాపట్ల పట్టణంలోని ఎంతో కీలకమైన రథంబజారు, శివాలయం రోడ్డు, సూర్యలంక రోడ్డు, రైల్వే స్టేషన్‌ ఎదురు రోడ్డు, బృందానం రోడ్డు, ప్యాడిషన్‌పేట, అక్బర్‌పేటరోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాగా, తాజాగా ప్రధాన రహదారిగా ఉన్న జీబీసీ రోడ్డు విస్తర్ణ పనులు చేపట్టారు. మొత్తం 80 అడుగుల వెడల్పుతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. కొత్తబస్టాండ్‌ వద్ద నుంచి దగ్గుమల్లివారిపాలెం వరకు 80 అడుగుల రోడ్డు, అక్కడ నుంచి ఇంజినీరింగ్‌ కళాశాల పక్కన జాతీయరహదారి వరకు 120 అడుగుల రోడ్డు విస్తర్ణకు చర్యలు చేపట్టారు. మరోవైపు కర్లపాలెం రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లు తొలగించి కలెక్టరేట్‌కు ప్రధాన రహదారిగా తీర్చిదిద్దేందుకు చర్యలు మొదలయ్యాయి.

కలెక్టరేట్‌కు ఇరువైపు రోడ్లు ఇలా... 
బాపట్ల జిల్లా కలెక్టరేట్‌ ఏర్పాటు చేసిన మానవ వనరుల కేంద్రానికి వెళ్ళే రోడ్లు విస్తర్ణ పనులు చేపట్టారు. గుంటూరు ప్‌లై ఓవర్‌ బ్రిడ్జికి ఇరువైపులా విస్తర్ణ పనులు చేపట్టి రోడ్లు వేస్తున్నారు. రోడ్లుకు ఇరువైపులా విస్తర్ణ చేయడంతోపాటు సెంటర్‌ లైటింగ్‌లో పనులు చేపట్టడంతో రోడ్లు అందంగా రూపురేఖలు మారుతున్నాయి.  

వేగంగా జాతీయ రహదారి పనులు... 
మరోవైపు జాతీయరహదారి పనులు వేగంగా సాగుతున్నాయి. బాపట్ల బైపాస్‌ రోడ్డు నాలుగులైన్లు విస్తరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి చేపట్టిన చర్యలకు జాతీయ రహదారి నుంచి అనుమతులు రావడంతో నాలుగులైన్లు పనులు సాగుతున్నాయి. ఎనిమిది కిలోమీటర్లు మేరకు సెంటర్‌ డివైర్డర్లతోపాటు సెంటర్‌లైటింగ్‌తో రోడ్లు పనులు సాగుతున్నాయి.  

మరిన్ని వార్తలు