రోబో రక్షిస్తుంది

12 Sep, 2022 05:36 IST|Sakshi
రోబో పనితీరును మేయర్, కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌కు వివరిస్తున్న లైఫ్‌ సేవ్‌ సంస్థ సిబ్బంది

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): సముద్రంలో ప్రమాదవశాత్తూ మునిగిపోతున్న వారిని క్షణాల్లో రక్షించేందుకు రోబో అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా వైజాగ్‌ సేఫ్‌ సంస్థ ‘లైఫ్‌ బాయ్‌’ పేరుతో ఈ రోబోను రూపొందించింది. దీనిని ఇటీవల నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ప్రారంభించారు. 

ఈ రోబో పూర్తిగా బోటు తరహాలోనే పనిచేస్తుంది. ఒకేసారి ముగ్గురిని కాపాడనుంది. సెకనుకు 7 మీటర్ల వేగంతో 600 మీటర్ల వరకు పనిచేస్తుంది. ఈ రోబో ధర రూ.5.50 లక్షలు కాగా, వీటిని కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉంచేందుకు ఐదు యంత్రాలను ప్రభుత్వ అనుమతితో  కొనుగోలు చేయనున్నారు.  
అలలపై దూసుకుపోతున్న రోబో 

మరిన్ని వార్తలు