వికేంద్రీకరణపై రౌండ్‌టేబుల్‌ సమావేశం: మేధావులు ఏమన్నారంటే

1 Oct, 2022 17:04 IST|Sakshi

సాక్షి, కాకినాడ: ఏపీ అభివృద్ధి​​​- పరిపాలన వికేంద్రీకరణపై మేధావులు, విద్యార్థులు, రాజకీయ విశ్లేషకులు, గళం విప్పారు. వికేంద్రీకరణ అంశంపై కాకినాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ​మంత్రులు బొత్స సత్యనారాయణ, వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ఎంపీలు సుభాష్‌ చంద్రబోస్‌, వంగా గీత, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖలో అన్ని వనరులూ ఉండటం సానుకూలాంశంగా  విద్యార్థులు పేర్కొన్నారు. 
చదవండి: ప్లీజ్‌.. తమ్ముళ్లూ ప్లీజ్‌.. టీడీపీ నేతలకు చంద్రబాబు లాలింపు 

విభజనతో నష్టపోయింది మనమే..
అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కావడంతోనే ఉద్యమాలు జరుగుతున్నాయని జర్నలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నది మంచి ఆలోచన అన్నారు. హైదరాబాద్‌ను వదులుకోవడమే పెద్ద తప్పు. విభజన సమయంలో నష్టపోయింది మనమే అని జర్నలిస్టులు అన్నారు.

సీఎం జగన్‌ లక్ష్యాన్ని స్వాగతిస్తున్నాం: కాకినాడ వాసులు
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని కాకినాడ వాసులు అన్నారు. పాదయాత్ర పేరుతో దండయాత్రలా? అంటూ ప్రశ్నించారు. వికేంద్రీకరణ కోసం ఎందాకైనా ఉద్యమిస్తామని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కాంక్షిస్తున్న ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. అమరావతి పేరుతో చేస్తున్న పాదయాత్రకు కర్త,కర్మ,క్రియ చంద్రబాబే. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న సీఎం జగన్‌ లక్ష్యాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గతంలో చెన్నై, హైదరాబాద్‌ను వదులుకోవాల్సి వచ్చిందని.. ఒకే రాజధాని ఉంటే మళ్లీ అదే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

ఉద్యోగావకాశాలు పెరుగుతాయి..
వికేంద్రీకరణతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని మేధావులు పేర్కొన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకూడదన్నారు.

వికేంద్రీకరణ ఆలోచన అందుకే వచ్చింది: ఎంపీ బోస్‌
వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. అభివృద్ధి అంతటా జరగాలని కోరుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాలతోనే వికేంద్రీకరణ ఆలోచన వచ్చిందన్నారు. సీఎం జగన్‌ ఆలోచించి, చర్చించి నిర్ణయం తీసుకున్నారని సుభాష్ చంద్రబోస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు