ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లు 

11 Jun, 2022 23:35 IST|Sakshi

కడప కోటిరెడ్డి సర్కిల్‌:  రెల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) పరీక్ష రాసే అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే  ప్రత్యేక రైళ్లను నడుపుతోందని చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. కడప– బెంగళూరు–కడప మధ్య ఒక రైలు, కడప– నల్గొండ–కడపల మధ్య మరో రైలు నడుపుతున్నామన్నారు. ఈనెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు కడప రైల్వే స్టేషన్‌ నుంచి ఈ ప్రత్యేక రైలు(నంబర్‌–07582) బయలుదేరి రాజంపేట, రైల్వేకోడూరు,  కాట్పాడి, జోలార్‌పేట మీదుగా బెంగళూరుకు అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు చేరుతుందన్నారు.

ఈ రైలు ఈనెల 12వ తేదీన సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కడపకు చేరుకుంటుందన్నారు. అలాగే నల్గొండ నుంచి కడపకు ఈనెల 10వ తేదీ ప్రత్యేక రైలు బయలుదేరిందని, 13న ఉదయం 6 గంటలకు కడప నుంచి బయలుదేరి ప్రొద్దుటూరు, నంద్యాల, గిద్దలూరు, కంభం, మార్కాపురం, దొనకొండ, నరసరావుపేట, గుంటూరు, శెట్టిపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదుగా సాయంత్రం 4.45 గంటలకు నల్గొండ చేరుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.   

మరిన్ని వార్తలు