బీన్స్‌ గింజపై ఆస్కార్‌ ‘నాటు నాటు’ 

23 Mar, 2023 08:30 IST|Sakshi
బీన్స్‌ గింజపై ‘నాటు నాటు’ సూక్ష్మ చిత్రం, (ఇన్‌సెట్‌లో) ఎ.శివనాగేశ్వరరావు 

తెనాలి(గుంటూరు జిల్లా): లాస్‌ ఏంజిలిస్‌లో ఇటీవల జరిగిన 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ను అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు..ఊర నాటు’ పాటను ప్రవాస భారతీయ చిత్రకారుడు బీన్స్‌ గింజపై చిత్రీకరించారు. దర్శక ప్రముఖుడు రాజమౌళి తీసిన ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాటను జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌పై చిత్రీకరించారు.

ఆస్కార్‌ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌ అందుకున్నారు. కువైట్‌లోని పాహీల్‌ అల్‌ వతానీ ఇండియన్‌ ప్రైవేట్‌ స్కూలులో చిత్రకళ విభాగం అధిపతి ఎ.శివనాగేశ్వరరావు వైట్‌ బీన్స్‌ గింజపై సూక్ష్మంగా చిత్రీకరించారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ మూమెంట్‌ను, మధ్యలో ఆస్కార్‌ అవార్డును తీర్చిదిద్దారు. చిత్రకారుడనైన తాను, ఈ సూక్ష్మచిత్రంతో ఆర్‌ఆర్‌ఆర్‌ బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నట్టు శివనాగేశ్వరరావు ‘సాక్షి’కి ఫోనులో వెల్లడించారు. శివనాగేశ్వరరావు స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి.
చదవండి: రూ.6 కోట్లు ఉంటే.. అంతరిక్షంలోకి! నెరవేరనున్న భారతీయుల కల

మరిన్ని వార్తలు