శ్రీలక్ష్మి కుటుంబానికి రూ.10 లక్షలు అందజేత

21 Jun, 2022 08:12 IST|Sakshi

సీఎంఆర్‌ఎఫ్‌ సాయంతో పాటు, ఇంటి స్థలం, ఇల్లు మంజూరు

గుంటూరు వెస్ట్‌: గుంటూరు జిల్లా  తుమ్మపూడి గ్రామానికి చెందిన వివాహిత శ్రీలక్ష్మి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మేరకు సాయాన్ని అందించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 27న శ్రీలక్ష్మి హత్యకు గురైంది. ఆమె కుటుంబానికి ఆసరాగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ఆ మేరకు సోమవారం సీఎం సహాయ నిధి నుంచి వచ్చి న మొత్తం రూ.10 లక్షలను  కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ నగదును చిన్నారులు ఇద్దరికీ చెరో రూ.5 లక్షల చొప్పున డిపాజిట్‌ చేసి, సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో డిపాజిట్‌ పత్రాలను వారికి అందజేశారు. దీంతోపాటు ఇంటి స్థలం పట్టా, ఇల్లు మంజూరు చేసిన పత్రాలనూ అందజేశారు. జేసీ రాజకుమారి, డీఆర్వో చంద్రశేఖరరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు