ఏపీలో రూ.1.23 లక్షల కోట్లతో పోర్టు కార్యకలాపాలు 

4 Sep, 2023 06:37 IST|Sakshi

కేంద్ర మంత్రి శర్బానంద్‌ సోనోవాల్‌    

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో రూ.1.23 లక్షల కోట్లతో పోర్టు కార్యకలాపాలు జరుగుతున్నాయని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖల మంత్రి శర్బానంద్‌ సోనోవాల్‌ తెలిపారు. వీటితో 113 ప్రాజెక్టులను చేపడుతున్నామన్నారు.

ఇందులో ఇప్పటివరకు 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు.  విశాఖలో ఆదివారం  మీడియాతో  మాట్లాడారు.  విశాఖ పోర్టు ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌ను సోమవారం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విశాఖ పోర్టును సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నామని, ఆధునికీకరణ, యాంత్రీకరణతో మెరుగు పరుస్తున్నామని వివరించారు. విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తలు