సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం

27 May, 2021 04:11 IST|Sakshi

కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ దాతృత్వం

సాక్షి, అమరావతి: కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సీఎం సహాయనిధికి కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ రూ.2 కోట్ల విరాళం ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సమీర్‌ గోయెల్, వైస్‌ ప్రెసిడెంట్‌(కార్పొరేట్‌ రిలేషన్స్‌) కె.సత్యనారాయణ బుధవారం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి అందజేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కూడా ఉన్నారు.   

మరిన్ని వార్తలు